schedule Sunday, September 06, 2026

కేవీసీఎస్‌లో మ్యాథ్స్ డే వేడుక

calendar_today December 22, 2025
person dharshininews
కేవీసీఎస్‌లో మ్యాథ్స్ డే వేడుక
కేవీసీఎస్‌లో మ్యాథ్స్ డే వేడుక - ఉత్సహాంగా పాల్గొన్న విద్యార్థులు - గణిత ప్రదర్శనలతో మక్కువ చాటిన వైనం - అభినందించిన స్కూల్ ప్రిన్సిపల్, డైరెక్టర్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం పోట్లీ మహరాజ్ దేవాలయ ప్రాంగణంలోని కృష్ణవేణి కాన్సెప్ట్ హై స్కూల్(కేవీసీఎస్)లో నేషనల్ మ్యాథ్స్ డే ను వేడుకగా జరుపుకున్నారు. kvcs సోమవారం గణిత శాస్త్ర పితామహుడు రామానుజన్ జయంతి సందర్భంగా నిర్వహించిన గణిత దినోత్సవంలో విద్యార్థులు ఉత్సహాంగా పాల్గొన్నారు. పాఠశాల ప్రిన్సిపల్ ప్రశాంత్, డైరెక్టర్ సతీష్ ల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఆర్యభట్ట, భాస్కర, శకుంతలా దేవి, నరేంద్ర కర్మాకర్ లకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలు గణిత ఆకృతులు, గణాంకాలతో ప్రదర్శనలు ఇచ్చారు. రామానుజన్ నెంబర్ 1729 నెంబర్ తో ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలించింది. అదేవిధంగా అభాకస్, ఫింగర్ థియేరీ, ఆట పాటలతో గణితంపై ఉన్న మక్కువను చాటుకున్నారు. ఇటీవల జరిగిన చెస్ ఛాంపియన్ షిప్ లో ప్రతిభ కనబరిచిన విద్యార్థిని అభినందించారు. అనంతరం ప్రిన్సిపల్ ప్రశాంత్ మాట్లాడుతూ జీవితంలో గణితం ఎంతో ముఖ్యమైందని అన్నారు. గణితంపై ఉన్న భయాన్ని చెరిపేసుకోవాలన్నారు. ఇష్టంతో చదివితే అంతా సులువుగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో టీచర్లు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/40125/