schedule Tuesday, September 08, 2026

పండగలా కందుకూరి రాజ్ కుమార్ జన్మదినం

calendar_today December 23, 2025
person dharshininews
పండగలా కందుకూరి రాజ్ కుమార్ జన్మదినం
పండగలా కందుకూరి రాజ్ కుమార్ జన్మదినం - ఆసుపత్రిలో అల్పహారం పంపీణి వేడుకలు - మహిళలకు చీరల పంపిణీ చేసిన నేతలు - ఉత్సహాంగా పాల్గొన్న రాజకీయ, సంఘాల నాయకులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరుకు చెందిన బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు, బీసీల నాయకుడు కందుకూరి రాజ్ కుమార్ జన్మదిన వేడుకలు పండగలా జరుపుకున్నారు. మంగళవారం రాజ్ కుమార్ జన్మదినం పురస్కరించుకుని బీసీ సంఘం ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణంలోని మాత శిశు ఆసుపత్రి దగ్గర అల్పాహారము, పండ్లు బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. మల్‌రెడ్డిపల్లిలో యువ నాయకులు అనిత రమేష్ ఆధ్వర్యంలో పేదలకు చీరలు పంపిణీ చేశారు. అనంతంర విశాల్ మార్ట్ ఆవరణలో ఘనంగా కేక్ కట్ చేసి ఉత్సాహంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. బీసీ సంఘం నియోజకవర్గ అధ్యక్షులు అనిత రాజ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రాజ్ కుమార్ జన్మదిన వేడుకల్లో పలువురు రాజకీయ నేతలతో పాటు బీసీ సంఘం, వివిధ సంఘాల నాయకులు ఉత్సహాంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ బీసీల మద్దుబిడ్డగా బీసీల సంక్షేమానికి, అభివృద్ధికి రాజ్ కుమార్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. భవిష్యత్తులో కూడా బీసీల కోసం అహర్నిషలు పోరాటం చేసి మంచి నాయకుడుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/40176/