schedule Friday, September 04, 2026

మాజీ గవర్నర్ చేతుల మీదుగా తాండూరు వాసికి సన్మానం

calendar_today December 24, 2025
person dharshininews
మాజీ గవర్నర్ చేతుల మీదుగా తాండూరు వాసికి సన్మానం
మాజీ గవర్నర్ చేతుల మీదుగా తాండూరు వాసికి సన్మానం - గ్రూప్-1 ఉద్యోగి కుర్వ క్రాంతికి దక్కిన గౌరవం తాండూరు, దర్శిని ప్రతినిధి : హర్యాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ చేతుల మీదుగా తాండూరు వాసికి సన్మానం జరిగింది. రాష్ట్ర కురుమ సంఘం ఆధ్వర్యంలో బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లాలో రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్-1, గ్రూప్ -2 సాధించిన విద్యార్థులకు అభినందన సభ నిర్వహించారు. తాండూరుకు చెందిన ప్రముఖ న్యాయవాది కుర్వ గోపాల్ కుమారుడు కుర్వ క్రాంతి గ్రూప్ -1లో ఉద్యోగం సాధించడంతో సన్మాన సభలో పాల్గొన్నారు. భువన గిరి ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షులు, ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశంల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన హర్యాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ద్వారా కుర్వ క్రాంతి కుమార్ సన్మానం పొందారు. తాండూరు బిడ్డకు మాజీ గవర్నర్ ద్వారా సన్మానం దక్కడం పట్ల స్థానిక కురుమ సంఘం నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/40196/