schedule Tuesday, September 08, 2026

కత్తిపోట్ల దాడిలో విషాధం..!

calendar_today December 26, 2025
person dharshininews
కత్తిపోట్ల దాడిలో విషాధం..!
కత్తిపోట్ల దాడిలో విషాధం..! - గాయపడిన తండ్రి మృతి - పోలీసుల అదుపులో నిందితలు..? తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం రాజీవ్ కాలనీలో జరిగిన కత్తిపోట్ల ఘటనలో విషాదం నెలకొంది. నిందితుడి దాడిలో గాయపడిన తండ్రిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ తరలిస్తండగా మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. తాండూరు మండలం ఖాంజాపూర్ గ్రామానికి చెందిన గోపాల్, తాండూరు పట్టణం ఇందిరమ్మ కాలనీకి చెందిన కిట్టుల మద్య గొడవల నేపథ్యంలో గోపాల్ కిట్టును చంపాలని తన వెంట కత్తి తెచ్చుకున్నాడు. రాజీవ్ కాలనీ సమీపంలో ఉన్న కిట్టుపైదాడి చేసేందుకు యత్నించాడు. అంతలోనే అక్కడే ఉన్న నూర్ హైమద్ కు చెందిన చికెన్ షాపులో దూరి షెటర్ వేసుకున్నాడు. అడ్డుకున్న నూర్ హైమద్, అతని కుమారుడిపై గోపాల్ కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో నూర్ హైమద్ తీవ్రంగా గాయపడడంతో ప్రాథమిక చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ తరలిస్తుండగా మృతి చెందాడు. కుమారుడు తాండూరులోని జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందారు. మరోవైపు దాడిలో ప్రధాన నింధితుడు గోపాల్‌తో పాటు అతని వెంట ఉన్న అదర్శ్, అనిల్, ప్రవీణ్‌ కుమార్‌, రాజీవ్‌ కాలనీకి చెందిన క్రిష్ణ తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/40215/