schedule Sunday, July 05, 2026

సాయిపూర్ సమస్యలు పరిష్కరానికి కృషి

calendar_today December 27, 2025
person dharshininews
సాయిపూర్ సమస్యలు పరిష్కరానికి కృషి
సాయిపూర్ సమస్యలు పరిష్కరానికి కృషి - డ్రైనేజీ, తాగునీటి ట్యాంకులు మంజూరు ధ్యేయం - కాంగ్రెస్ నాయకులు బంటు మల్లప్ప తాండూరు, దర్శినిప్రతినిధి : తాండూరు పట్టణం సాయిపూర్ లోని సమస్యలు పరిష్కరానికి కోర్ కమిటి సహాకారంతో కృషి చేయడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు బంటు మల్లప్ప అన్నారు. శనివారం సాయిపూర్ లోని 9వ వార్డులో అధికారులు, ప్రజా ప్రతినిధులతో ఏర్పాటైన కోర్ కమిటి సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం కోర్ కమిటి సభ్యులు బంటు మల్లప్ప అధికారులతో కలిసి వార్డులో పర్యటించారు. వార్డులో సీసీ రోడ్లు, మురుగు కాలువల సమస్యలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అదేవిధంగా అస్తవ్యస్తంగా మారిన తాగునీటి ట్యాంకుల పరిస్థితిని చూపించారు. ఈ సందర్భంగా బంటు మల్లప్ప మాట్లాడుతూ వార్డులో ప్రజలకు అవసరమైన సీసీ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరారు. దీంతో పాటు ట్యాంకులకు మరమ్మత్తులు చేయించాలని, లేదా కొత్త తాగునీటి ట్యాంకులు మంజూరు చేయాలని కోరారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహాకారంతో వార్డులో సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో శానిటరి ఇను స్పెక్టర్ వెంకటయ్య, వార్డు ఆఫీసర్ స్వప్న లత, కోర్ కమిటి సభ్యులు, వార్డు పెద్దలు, యువకులు ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/40238/