schedule Saturday, July 04, 2026

మందుబాబులకు షాక్...!

calendar_today December 29, 2025
person dharshininews
మందుబాబులకు షాక్...!
మందుబాబులకు షాక్...! - కేసులో నిందితులకు భారీ ఫైన్ - వివరాలు వెల్లడించిన పట్టణ సీఐ సంతోష్ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి : మద్యం సేవించి వాహనాలు నడిపిన మందుబాబులకు గట్టి షాక్ తగిలింది. కేసులు నమోదైన వాహనదారులకు భారీ జరిమాన విధిస్తూ తాండూరు న్యాయస్థానం తీర్పు వెలువరించిందని తాండూరు పట్టణ సీఐ సంతోష్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇటీవల నిర్వహించిన వాహనాల తనిఖీలలో మద్యం సేవించి 48 మంది పట్టుబడ్డారు. ఈ మేరకు వారిపై కేసు నమోదుయ్యింది. దీంతో సోమవారం తాండూరు న్యాయస్థానంలో హాజరు పరచగా సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నరేందర్ మద్యం సేవించి వాహనాలు నడిపిన 48 మందికి రూ.74వేల జరిమాన విధిస్తూ తీర్పు వెలువరించినట్లు సీఐ సంతోష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఎవరైనా మద్యం సేవించి వాహనాలు నడిపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/40278/