schedule Thursday, September 10, 2026

శ్రీశైలం పాదయాత్ర భక్తులకు అన్నదానం

calendar_today January 2, 2026
person dharshininews
శ్రీశైలం పాదయాత్ర భక్తులకు అన్నదానం
శ్రీశైలం పాదయాత్ర భక్తులకు అన్నదానం - శంకర్ యాదవ్ కుటుంబ సభ్యుల సేవాతత్పరత తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నుంచి శ్రీశైలంకు పాదయాత్రగా బయల్దేరిన భక్తులకు తాండూరుకు చెందిన రియల్ ఏస్టేట్ వ్యాపారి, సాయిపుత్ర హోమ్స్ అండ్ డెవలపర్స్ అధినేత బావనోళ్ల శంకర్ యాదవ్ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. శుక్రవారం కోడంగల్ - ఉడిమేశ్వరం మార్గంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి శంకర్ యాదవ్ తండ్రి హనుమయ్య, సతీమణి చంద్రకళ, కూతురు వైష్ణవిలతో పాటు మిత్రబృందం బీసీ సంఘం కన్వీనర్ కందుకూరి రాజ్ కుమార్, జొన్నల వినోద్ కుమార్, మనోహర్ యాదవ్, బంటు మల్లప్ప, వేణుగోపాల్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. తాండూరుకు చెందిన సిరిగిరిపేట్ శేఖర్, కేశవరావు, రమణారెడ్డిల ఆధ్వర్యంలో శ్రీశైలంకు పాదయాత్రగా వెళుతున్న భక్తులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రతి యేడాది శంకర్ యాదవ్ భక్తులకు అన్నదానం చేస్తూ సేవా తత్పరతను చాటుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో యువకులు శ్రీనివాస్, మల్లేష్ యాదవ్, అరుణ్ కుమార్, సురేష్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/40375/