schedule Sunday, July 05, 2026

వార్డులో ఎక్స్‌ట్రా ఓటర్లు..!

calendar_today January 3, 2026
person dharshininews
వార్డులో ఎక్స్‌ట్రా ఓటర్లు..!
వార్డులో ఎక్స్‌ట్రా ఓటర్లు..! - వందల కొద్ది నమోదు.. సవరించి తొలగించండి - అధికారులకు బీఆర్ఎస్ నాయకుల ఫిర్యాదు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధిలో ముసాయిదా జాబితాపై అభ్యంతరాల పర్వం కొనసాగుతోంది. ఒక్కో వార్డులో ఇతర వార్డులకు చెందిన ఓటర్లు నమోదై ఉన్నారని, వెంటనే తొలగించాలని రాజకీయ పార్టీల నేతలు వెల్లువలా ఫిర్యాదులు చేస్తున్నారు. తాండూరు పట్టణంలోని 28వ వార్డుకు సంబంధించిన ఓటరు జాబితాపై బీఆర్ఎస్ యువనాయకులు ఎస్పీ రవికాంత్, వినోద్‌ కుమార్‌లు అభ్యంతరం వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్యాలయంలో అధికారులకు ఫిర్యాదు చేశారు. 28వ వార్డులో ఇతర వార్డులకు చెందిన ఓటర్ల వివరాలు నమోదైన ఉన్నాయని అన్నారు. వార్డుకు సంబంధించిన వారికంటే ఎక్స్‌ట్రా ఓటర్లు ఉన్నారని తెలిపారు. సుమారు 350 మంది వివరాలు ఇతర ప్రాంతాలకు చెందిన వారివే ఉన్నాయని ఫిర్యాదులో ఆరోపించారు. దీని వల్ల ఎన్నికల్లో ఇబ్బందులు జరిగే అవకాశం ఉందని అన్నారు. కావున ముసాయిదా జాబితాలోఉన్న ఎక్స్‌ట్రా ఓటర్లను తొలగించి.. సవరించి తుది జాబితాను ప్రకటించాలని కోరారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/40387/