schedule Sunday, July 05, 2026

ఇతర వార్డుల ఓటర్లను తొలగించండి

calendar_today January 5, 2026
person dharshininews
ఇతర వార్డుల ఓటర్లను తొలగించండి
ఇతర వార్డుల ఓటర్లను తొలగించండి - ఒకే వార్డులో మూడు ప్రాంతాల వారితో ఇబ్బందులు - కాంగ్రెస్ నాయకులు బంటు మల్లప్ప - మున్సిపల్ అధికారులకు పిర్యాదు తాండూరు, దర్శిని ప్రతినిధి : మా వార్డులో ఉన్న ఇతర వార్డుల ఓటర్లను తొలగించాలని కాంగ్రెస్ నాయకులు బంటు మల్లప్ప కోరారు. సోమవారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు ప్రకటించిన ముసాయిదా ఓటర్ల జాబితా గందరగోళంగా ఉందని అన్నారు. పట్టణంలోనీ 9వ వార్డులో శాంతి నగర్, ఎన్టీఆర్ నగర్, భవాని నగర్, రాయల్ కాంటా ఏరియాలకు చెందిన ఓటర్లు భారీగా ఉన్నారని తెలిపారు. వార్డులో ఇతర ప్రాంతాలకు చెందిన ఓటర్లు ఉండడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. ఎన్నికలలో పోటీ చేసే వారు, ఓటర్లు అవస్థలు పడాల్సి వస్తుంది అని అన్నారు. ముసాయిదా జాబితాలో ఇతర వార్డుల ఓటర్లను తొలగించాలని డిమాండు చేశారు. పారదర్శకంగా తుది జాబితా విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.   ఇది కూడా చదవండి....   https://www.dharshininews.com/40408/