మెరిసిన అక్షర బాల శాస్త్రవేత్తలు
January 6, 2026
dharshininews
మెరిసిన అక్షర బాల శాస్త్రవేత్తలు
- రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు ఇద్దరి ఎంపిక
- సంతోషం వ్యక్తం చేసిన యజమాన్యం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం అక్షర హైస్కూల్ కు చెందిన ఇద్దరు విద్యార్థులు వైజ్ఞానిక ప్రదర్శనలో మెరిశారు. పాఠశాల తరపున రెండు ప్రదర్శనలతో ఆకట్టుకుని రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికయ్యారు.
మంగళవారం పరిగిలో వికారాబాద్ జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర స్థానలో అక్షర స్కూల్ నుంచి 8వ తరగతి విద్యార్థి మనోఉల్లాస్ రెడ్డి వ్యర్థ పదార్థాలతో విద్యుత్ తయారు చేయడం, మండించే సమయంలో విడులయ్యే కార్బన్ గ్యాస్ ను శుద్ధి చేసే ప్రదర్శన ఇచ్చాడు.
అదేవిధంగా 10వ తరగతి విద్యార్థిని శ్రీనిధి గాలి తేమలో నీటిని స్వీకరించి శుద్ధి చేయడమే కాకుండా ఏడి ప్రాంతాలతో నీటిని స్వీకరించే ప్రదర్శన ఇచ్చారు. ఈ ఇద్దరు విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. దీంతో వారిని రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ మోహన్ కృష్ణ గౌడ్ విద్యార్థులతో పాటు సైన్స్ టీచర్స్ రవికుమార్, శ్రీకాంత్ లను అభినందించారు.
ఇదికూడా చదవండి...
https://www.dharshininews.com/40436/