schedule Sunday, July 05, 2026

విద్యార్థుల అభ్యన్నతికి క్రీడలు దోహదం

calendar_today January 8, 2026
person dharshininews
విద్యార్థుల అభ్యన్నతికి క్రీడలు దోహదం
విద్యార్థుల అభ్యన్నతికి క్రీడలు దోహదం - శ్రీనేతాజీ గురుకుల్ హైస్కూల్ డైరెక్టర్ మణిమాల - అట్టహాసంగా వార్షిక క్రీడా ఉత్సవాలు తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యార్థులు అభ్యన్నతికి క్రీడలు దోహదపడతాయని తాండూరు శ్రీ నేతాజీ గురుదేవ్ గురుకుల్ హైస్కూల్ డైరెక్టర్ మణిమాల అన్నారు. గురువారం రెండో రోజు స్కూల్లో వార్షిక క్రీడా ఉత్సవాలు అట్టహాసంగా కొనసాగాయి. ఈ కార్యక్రమానికి డైరెక్టర్ మణిమాల హాజరై ప్రిన్సిపల్ శివలీలతో కలిసి క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మణిమాల మాట్లాడుతూ క్రీడల వల్ల విద్యార్థుల్లో శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతాయన్నారు. అంతేకాకుండా క్రీడలతో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని అన్నారు. చదవుతో పాటు క్రీడల్లో రాణించడం వల్ల విద్యార్థులు అభ్యున్నతికి సాధించవచ్చని అన్నారు. క్రీడా పోటీల్లో గెలుపు ఓటములను సమానంగా తీసుకొ వాలని సూచించారు. ఉత్సవాల ముగింపు రోజు విజేతలకు బహుమతులు అందిస్తామని చెప్పారు. క్రీడా ఉత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తున్న ప్రిన్సిపల్ శివలీలను అభినందించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ టీచర్లు, పీటీలు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/40457/