schedule Tuesday, September 08, 2026

శ్రీసాయి మేధాలో సంక్రాంతి సంబరాలు

calendar_today January 9, 2026
person dharshininews
శ్రీసాయి మేధాలో సంక్రాంతి సంబరాలు
శ్రీసాయి మేధాలో సంక్రాంతి సంబరాలు - ఆకట్టుకులు హరిదాసులు, గంగిరెద్దుల ప్రదర్శన - ఉట్టిపడిన పండగ సంప్రదాయాలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం శివాజీ చౌరస్తా సమీపంలోని శ్రీ సాయి మేధ విద్యాలయంలో ముందస్తుగా శుక్రవారం సంక్రాంతి వేడుకలను వైభవంగా నిర్వహించారు. విద్యార్థులు తీరొక్క రంగులతో వేసిన అందమైన ముగ్గులు చూపురుల‌ను ఆకట్టుకున్నాయి. విద్యార్థులు హరిదాసుల వేశ‌దార‌ణ‌ల‌తో, గంగిరెద్దుల ఆట‌పాట‌ల‌తో సంక్రాంతి పండుగ‌ వైభవం చాటారు. విద్యార్థుల ఆటపాటలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పాఠశాలలో అన్ని రకాలైన సాంస్కృతిక కార్యకలాపాలు విద్యార్థులకు నిర్వహిస్తూ…వారిలో మన పండుగల పట్ల మన భారతీయ సంస్కృతి పట్ల అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులతో కలిసి భోగి మంటలు వేసి, సంక్రాంతి పండుగ గొప్పదనాన్ని పాఠశాల విద్యార్థులకు వివరించినట్లు తెలిపారు. ప్రతి పండుగ వెంట మానవుని జీవనశైలి దాగి ఉందన్నారు. పండుగల సంస్కృతి, సంప్రదాయ కార్యక్రమాల నిర్వహణకు సహకరిస్తున్న ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/40490/