schedule Tuesday, September 08, 2026

పోలింగ్ కేంద్రాలపై ఫోకస్..!

calendar_today January 13, 2026
person dharshininews
పోలింగ్ కేంద్రాలపై ఫోకస్..!
పోలింగ్ కేంద్రాలపై ఫోకస్..! - ఇబ్బందులు, మౌళిక సదుపాయాలపై ఆరా - పరిశీలించిన కమీషనర్ బి.యాదగిరి - పట్టణంలో పోలింగ్ కేంద్రాలు ఎన్ని అంటే...? తాండూరు, దర్శిని ప్రతినిధి : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తాండూరు పట్టణంలో పోలింగ్ కేంద్రాలపై అధికారులు దృష్టిసారించారు. ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు తాండూరు పట్టణంలోని పోలింగ్ కేంద్రాల స్థితిగతులను పర్యవేక్షించారు. తాండూరు పట్టణంలోని 36వార్డులకు సంబంధించి 117 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఈ పోలింగ్ కేంద్రాలను మంగళవారం మున్సిపల్ కమీషనర్ యాదగిరి ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. పట్టణంలోని 4వ వార్డు, 5వ వార్డు, పాత తాండూరు ప్రాంతాలలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ పోలింగ్ కేంద్రాలు అనువుగా ఉన్నాయా లేదా అని పరిశీలించారు. ర్యాంపులు, విద్యుత్, తాగునీరు, మరగుదొడ్లు తదితర మౌళిక సదుపాయాలను పరిశీలించారు. ఇందిరానగర్ లో గతంలో ఉన్న పోలింగ్ కేంద్రంలో ప్రస్తుతం ఆర్బన్ ప్రాథమిక ఆసుపత్రి ఉండడంతో దానిని పోలింగ్ కేంద్రాలుగా వినియోగించుకోవచ్చా లేదా అని పరిశీలించారు. ఇక్కడ కుదరకపోతే ఈ పోలింగ్ కేంద్రాలను ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసే ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కమీషనర్ యాదగిరి మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు పట్టణంలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి.. కావాల్సిన ఏర్పాట్లపై పరిశీలించడం జరుగుతుందని అన్నారు. పోలింగ్ కేంద్రాలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఏఈ ఖాజా, టౌన్ ప్లానింగ్ అధికారులు, సిబ్బంది ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/40520/