schedule Sunday, July 05, 2026

మున్సిపల్ బరిలో బిర్కడ్ ఉశ వినయ్..!

calendar_today January 20, 2026
person dharshininews
మున్సిపల్ బరిలో బిర్కడ్ ఉశ వినయ్..!
మున్సిపల్ బరిలో బిర్కడ్ ఉశ వినయ్..! - పోటికి భరత్ భూషణ్ కోడలు ఉత్సహాం - ఎన్నికల్లో గెలుపుకు మెండుగా బలాలు - పట్టణంలో పోటీ చేసే వార్డు కూడా నిర్ణయం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ ఎన్నికల్లో మాజీ కౌన్సిలర్, మాజీ కోఆప్షన్ సభ్యురాలు బిర్కడ్ ఉశ వినయ్ సిద్దమయ్యారు. తాండూరు పట్టణంలో స్వర్గీయ భరత్ భూషణ్ కు రాజకీయంగా మంచి పేరు ఉంది. ఆమె కోడలుగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత జరిగిన మొదటి మున్సిపల్ ఎన్నికల్లో ఉశ వినయ్ కౌన్సిలర్ గా పోటీ చేశారు. పట్టణంలోని గాంధీనగర్ ప్రాంతం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ తరువాత జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కోఆప్షన్ సభ్యురాలుగా సేవలందించారు. తాజాగా జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో బిర్కడ్ ఉశ వినయ్ పోటీకి ఉత్సహాం చూపిస్తున్నారు. అధికార పార్టీ నుంచి టిక్కెట్ సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో కౌన్సిలర్ గా. కోఆప్షన్ సభ్యులుగా పనిచేసిన అనుభవంతో ప్రజలకు సేవ చేసేందుకు సిద్దమవుతున్నట్లు తెలిపారు. గత పాలన అనుభవాలే తమ విజయానికి బలాలుగా మారుతాయని ధీమా వ్యక్తం చేశారు. పట్టణంలోని 36వ వార్డు నుంచి పోటీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదికూడా చదవండి...   https://www.dharshininews.com/40619/