schedule Tuesday, September 08, 2026

వైభవంగా మార్కండేయ స్వామి జయంతి

calendar_today January 21, 2026
person dharshininews
వైభవంగా మార్కండేయ స్వామి జయంతి
వైభవంగా మార్కండేయ స్వామి జయంతి - దేవాలయంలో ప్రత్యేక అలంకరణ, పూజలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం కోడంగల్ రోడ్డు మార్గంలోని మార్కండేయ కాలనీలో వెలసిన మార్కండేయ స్వామి జయంతి ఉత్సవాలను వైభవంగా జరుపుకున్నారు. మార్కండేయ స్వామి జయంతి సందర్భంగా బుధవారం ఉదయం నుంచి దేవాలయంలో ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. ఆలయంలో వెలసిన మార్కండేయ స్వామికి అభిషేకం, ప్రత్యేక అలంకరణ, పూజలు నిర్వహించారు. జయంతి ఉత్సవాల సందర్భంగా పద్మశాలి కులస్తులు, కాలనీ వాసులు, భక్తులు పెద్ద ఎత్తున దేవాలయానికి తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి చల్లని దయ చూపించాలని వేడుకున్నారు. అదేవిధంగా దేవాలయ కమిటి ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. మరోవైపు ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన పద్మశాలి సర్పంచులతో పాటు విశ్రాంత ఉద్యోగులను ఘనంగా సన్మానించారు. జయంతి వేడుకలలో భాగంగా దేవాలయంలో భజన కీర్తనలు, హోమాలతో ఆద్యాత్మిక శోభ సంతరించుకుంది. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/40637/