schedule Sunday, July 05, 2026

సాహు శ్రీలతకే జై..!

calendar_today January 22, 2026
person dharshininews
సాహు శ్రీలతకే జై..!
సాహు శ్రీలతకే జై..! - 24వ వార్డులో మద్దతు ఆమెకే - మరోసారి పోటీకి సిద్దమైన మాజీ కౌన్సిలర్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం 24వ వార్డు ప్రజలు మాజీ కౌన్సిలర్ సాహు శ్రీలత లక్ష్మీకాంత్‌కు జై కొట్టారు. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో మళ్లీ కౌన్సిలర్‌గా పోటీ చేస్తున్న సాహు శ్రీలతకు వార్డు ప్రజలు మద్దతు తెలిపారు. బుధవారం రాత్రి వార్డులో సాహు శ్రీలత వార్డు ప్రజలతో ఆత్మీయ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో మరోసారి బరిలో నిలుస్తున్నట్లు తన నిర్ణయాన్ని వారితో పంచుకున్నారు. వచ్చే ఎన్నికల్లో తనకు పూర్తి మద్దతు అందించాలని కోరారు. వార్డు కౌన్సిలర్‌గా అవకాశం కల్పించిన ప్రజలను ఎప్పటికి మరువలేనని అన్నారు. గతంలో మాదిరిగా అందరి సహాకారంతో వార్డులో సమస్యల పరిష్కారంతో పాటు అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. ఇందుకు వార్డు మహిళలు, ప్రజలు సంపూర్ణ మద్దతు తెలిపారు. సాహు శ్రీలత లక్ష్మీకాంత్‌కు జై కొడుతూ వచ్చే ఎన్నికల్లో కౌన్సిలర్‌గా గెలిపించుకుంటామని భరోసా అందించారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/40641/