schedule Monday, September 07, 2026

మున్సిపల్‌ ఎన్నికలకు రెడీ..!

calendar_today January 27, 2026
person dharshininews
మున్సిపల్‌ ఎన్నికలకు రెడీ..!
మున్సిపల్‌ ఎన్నికలకు రెడీ..! - అధికారుల నియామకం పూర్తి - నామినేషన్ల పక్రియకు ఏర్పాట్లు ముమ్మరం తాండూరు, దర్శిని ప్రతినిధి : మున్సిపల్ ఎన్నికలకు తాండూరు అధికార యంత్రాంగం సిద్దమైంది. ఎన్నికల నిర్వహణలో భాగంగా అధికారుల నియామకం పూర్తయ్యింది. నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా ఎన్నికల నిర్వహణకు రెఢీ అంటున్నారు అధికారులు. ఇప్పటికే తాండూరు మున్సిపల్‌లో ఓటరు జాబితా సిద్దం చేశారు. పట్టణంలోని 36 వార్డుల్లో మొత్తం 77వేల 29 ఓటర్లు ఉన్నట్లు ప్రకటించారు. ఎన్నికలలో భాగంగా మొత్తం 117 పోలింగ్ కేంద్రాలను సిద్దం చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో 750 ఓటర్లు ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఈసారి అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ చేయనున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరాలతో నిఘా ఉంచబోతున్నారు. మరోవైపు నోటిఫికేషన్ వెలువడిన తరువాత చేపట్టే నామినేషన్ల పక్రియకు సంబంధించి ఏర్పాట్లలో నిమగ్నం అయ్యారు. నామినేషన్ల స్వీకరణకు ఎలాంటి ఏర్పాట్లు చేయాలో చర్చలు జరుపుతున్నారు. అదేవిధంగా ఎన్నికల కోసం పీఓ, ఏపీఓల నియామకం కూడా పూర్తయి పోయింది. పట్టణంలోని 117 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా ఒక్కో పోలింగ్ కేంద్రం చొప్పున 117 పిఓలు, అయా పోలింగ్ కేంద్రాలలో ముగ్గురు చొప్పున 351 ఏపీఓలను నియమించారు. మరోవైపు పట్టణంలోని సమస్యాత్మకం పోలింగ్ కేంద్రాలను పోలీసు అధికారులతో కలిసి పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలకు అస్కారం లేకుండా చూసేందుకు చర్యలు చేపడుతున్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/40726/