schedule Sunday, July 05, 2026

మున్సిపల్‌లోనే నామినేషన్లు...!

calendar_today January 27, 2026
person dharshininews
మున్సిపల్‌లోనే నామినేషన్లు...!
మున్సిపల్‌లోనే నామినేషన్లు...! - తాండూరు ఆపీసులో కౌంటర్ల ఏర్పాట్లు - దాఖలు చేసే టైం కూడా నిర్ణయం - కౌంటర్ల వద్ద అధికారుల నియామకం పూర్తి తాండూరు, దర్శిని ప్రతినిధి : మున్సిపల్ ఎన్నికలలో భాగంగా నామినేషన్ల స్వీకరణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగిందని కమీషనర్ పి. మధుసూదన్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఎన్నికల కమీషన్ షెడ్యూల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 28వ తేది నుంచి 30వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, 31న పరిశీలన, ప్రదర్శన చేయాలని ఉత్తర్వులు జారీ చేయడం విధితమే. ఈ మేరకు తాండూరు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేయడం జరిగిందని కమీషనర్ తెలిపారు. పట్టణంలోని 36 వార్డులకు సంబంధించి 12 కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఒక్కో కౌంటర్ వద్ద ఒక ఆర్వో చొప్పున 12 మంది, ఒక్కొక్క సహాయకులను నియమించడం జరిగిందని వెల్లడించారు. ఒక్కో కౌంటర్ వద్ద 3 వార్డులకు సంబంధించి నామినేషన్లను స్వీకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగిందని వివరించారు. 12 కౌంటర్లలో 3 వార్డుల చొప్పున 36 వార్డులకు నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందని స్పష్టం చేశారు. బుధవారం నుంచి ఈనెల 30వ తేది వరకు ఉదయం 10-30గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చని తెలిపారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/40739/