schedule Sunday, July 05, 2026

కాంగ్రెస్ పార్టీలోకి జుంటుపల్లి వెంకట్

calendar_today January 28, 2026
person dharshininews
కాంగ్రెస్ పార్టీలోకి జుంటుపల్లి వెంకట్
కాంగ్రెస్ పార్టీలోకి జుంటుపల్లి వెంకట్ - ఆహ్వానించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో బీజేపీ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన జిల్లా అధికార ప్రతినిధి జుంటుపల్లి వెంకట్ పార్టీకి రాజీనామ చేశారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సమక్షంలో జుంటుపల్లి వెంకట్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి జుంటుపల్లి వెంకట్ కు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జుంటుపల్లి వెంకట్ తో పాటు బీజేపీ కార్యకర్తలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపే ధ్యేయంగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు ధారాసింగ్, పట్టణ అధ్యక్షులు హాబీబ్ లాల, గాజుల మాధవి, నేతలు, కార్యకర్తలు ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/40754/