రౌడీ షీటర్లపై స్పెషల్ ఫోకస్..!
January 28, 2026
dharshininews
రౌడీ షీటర్లపై స్పెషల్ ఫోకస్..!
- చట్టవ్యతిరేకానికి పాల్పడితే చర్యలు
- హెచ్చరించిన తాండూరు పోలీసులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తాండూరు పోలీసులు అప్రమత్తం అయ్యారు. పాత నేరస్తులు, రౌడీ షీటర్లపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా, తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య ఆదేశాలతో వారిపై కదలికలపై దృష్టిసారించారు.
బుధవారం తాండూరు పట్టణ పోలీస్టేషన్‌లో రౌడీ షీటర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా పట్టణ సీఐ గూడూరి సంతోష్ కుమార్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఎవరైనా ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకపరిచే విధంగా ప్రవర్తించిన, దుర్భాషలాడిన వారి పైన చట్టరీత్య కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అందరు మంచి సత్ప్రవర్తనతో ఉండాలని ఎలాంటి చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలలో పాల్గొన రాదని హెచ్చరించారు. అల్లర్లు, అఘాయిత్యాలకు పాల్పడితే చర్యలు తవప్పవని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు పుష్పలత, సాజిద్ పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి...
https://www.dharshininews.com/40764/