schedule Tuesday, September 08, 2026

పదో వార్డులో పాగా వేస్తాం..!

calendar_today January 29, 2026
person dharshininews
పదో వార్డులో పాగా వేస్తాం..!
పదో వార్డులో పాగా వేస్తాం..! - ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీదే గెలుపు - కాంగ్రెస్ అభ్యర్థి అల్లాపూర్ జ్యోతి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం 10వ వార్డులో కాంగ్రెస్ పార్టీ పాగా వేయడం ఖాయమని ఆ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి అల్లాపూర్ జ్యోతి శ్రీకాంత్ అన్నారు. గురువారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో 10వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ తరుపున నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మొదటి సారి కౌన్సిలర్ బరిలో నిలుస్తున్నామని అన్నారు. 10వ వార్డులో ప్రజల ఆదరణ తమకే ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమం, అబివృద్ధి కోసం కృషి చేస్తోందని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపును ఎవ్వరు ఆపలేరని అన్నారు. 10వ వార్డులో భారీ మెజార్టీ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అల్లాపూర్ శ్రీకాంత్, దేవగారి రమేష్‌ తదితరులు ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/40779/