schedule Monday, September 07, 2026

ప్రజాదారణ బీఆర్ఎస్ పార్టీకే..!

calendar_today January 29, 2026
person dharshininews
ప్రజాదారణ బీఆర్ఎస్ పార్టీకే..!
ప్రజాదారణ బీఆర్ఎస్ పార్టీకే..! - 20వ వార్డులో గులాబీ గెలుపు ఖాయం - కౌన్సిలర్ అభ్యర్థి నవీన సంతోష్ గౌడ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : బీఆర్ఎస్ పార్టీకే ప్రజాదారణ ఉందని, మున్సిపల్ ఎన్నికల్లో గెలిచేది బీఆర్ఎస్ పార్టీనే అని కౌన్సిలర్ అభ్యర్థి నవీన సంతోష్ గౌడ్ అన్నారు. గురువారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో 20వ వార్డు అభ్యర్థిగా ఆమె నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయబోతున్నట్లు తెలిపారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ తమకు అవకాశం కల్పించినా స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగిందన్నారు. పట్టణంలో, వార్డులో బీఆర్ఎస్ పార్టీకే మంచి ఆదరణ ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ వల్ల ఏం అభివృద్ధి జరగలేదని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామిలను అమలు చేయకపోవడంతో ప్రజలు మళ్లీ అధికారంలోకి వచ్చే బీఆర్ ఎస్ పార్టీ వైపు మొగ్గుచూపుతున్నారని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలవడం ఖాయమని, తమ వార్డులో ప్రజలు ఆదరించి భారీ మెజార్టీ అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు సంతోష్ గౌడ్, వార్డు ప్రజలు ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/40781/