schedule Sunday, July 05, 2026

రెండో రోజు జోరుగా నామినేషన్లు

calendar_today January 29, 2026
person dharshininews
రెండో రోజు జోరుగా నామినేషన్లు
రెండో రోజు జోరుగా నామినేషన్లు - తాండూరులో 97 మంది దాఖలు - ప్రకటించిన మున్సిపల్ అధికారులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్లో రెండో రోజు కౌన్సిలర్ల నామినేషన్ల దాఖలు జోరుగా జరిగాయి. గురువారం ఉదయం నుంచి మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కౌంటర్లలో కౌన్సిలర్ల అభ్యర్థులు మద్దతు దారులతో కలిసి వచ్చి నామినేషన్లు వేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి 37 మంది, బీఆర్ఎస్ పార్టీ నుంచి 37 మంది, బీజేపీ నుంచి 18 మంది, ఎంఐఎం నుంచి 8 మంది, ఇతర పార్టీల నుంచి 4 మంది, స్వతంత్ర అభ్యర్థులు 4మంది నామినేషన్లు వేసినట్లు మున్సిపల్ కమీషనర్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. మొదటి రోజు 11 నామినేషన్లు రాగా రెండో రోజు 97 నామినేషన్లతో కలిసి మొత్తం 108 వరకు నామినేషన్లు చేరుకున్నాయని తెలిపారు. మరోవైపు నామినేషన్లు వేసేందుకు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నేతలు జోష్ ఫుల్ గా వచ్చారు. బ్యాండ్ బాజాలతో ఊరేగింపుగా కార్యాలయం వద్దకు చేరుకున్నారు. నేతలు, కార్యకర్తల ఉత్సహాంగా కొలాహలం నెలకొంది. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/40787/