schedule Sunday, July 05, 2026

కౌన్సిలర్‌ పోటీ నుంచి తప్పుకుంటున్నా..!

calendar_today January 30, 2026
person dharshininews
కౌన్సిలర్‌ పోటీ నుంచి తప్పుకుంటున్నా..!
కౌన్సిలర్‌ పోటీ నుంచి తప్పుకుంటున్నా..! - 3వ వార్డు నేత అంజద్‌ ఖాన్ నిర్ణయం - అసలు కారణాలు వెల్లడించిన నేత తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ ఎన్నికల నుంచి తప్పుకుంటున్నట్లు పట్టణంలోని 3వ వార్డుకు చెందిన మైనార్టీ నేత అంజద్ ఖాన్ ప్రకటించారు. అంజద్‌ ఖాన్ విషయంలో గురువారం ఊహించని పరిణాలు జరిగాయి. బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న అంజద్ ఖాన్ గురువారం ఉదయం తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదే రోజు రాత్రి తిరిగి మళ్లీ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ మద్యలో ఎన్నో రాజకీయ పరిణాలు చోటు చేసుకున్నాయి. పట్టణంలోని 3వ వార్డు నుంచి అటు కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి ఒకే అభ్యర్థిగా అంజద్‌ ఖాన్ కుటుంబం నిలిచింది. ఏ పార్టీ నుంచి నామినేషన్ వేసినా ఆయన గెలుపు ఖాయంగా కనిపించింది. కొన్ని గంటల్లోనే అంజద్‌ ఖాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మున్సిపల్ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. పట్టణంలోని 3వ వార్డు బీసీ మహిళకు రిజర్వు అయ్యింది. అంజద్ ఖాన్ కుటుంబం నుంచి మహిళ పోటీ చేయాల్సి ఉంది. అయితే గురువారం జరిగిన రాజకీయ పరిణామాలతో అంజద్ ఖాన్‌తో పాటు ఆయన కుటుంబంలో మానసిక సంఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో అంజద్‌ ఖాన్ మున్సిపల్ రేసు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో అంజద్ ఖాన్ రెండు పార్టీలకు షాక్ ఇచ్చినట్లుగా అయ్యింది. ఇదికూడా చదవండి.... https://www.dharshininews.com/40794/