schedule Monday, September 07, 2026

కోట్రిక కోడలు.. ప్రచార హోరు

calendar_today January 31, 2026
person dharshininews
కోట్రిక కోడలు.. ప్రచార హోరు
కోట్రిక కోడలు.. ప్రచార హోరు - మల్ రెడ్డిపల్లిలో విస్తృత పర్యటన - భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి తాండూరు, దర్శిని ప్రతినిధి : మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ పార్టీని గెలిపించే బాధ్యత మీది.. ఐదేళ్లు వార్డును అభివృద్ధి చేసే బాధ్యత మాది అంటూ తాండూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ కోడలు, 24వ వార్డు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి కోట్రిక నాగలక్ష్మీ శ్రీకాంత్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కోట్రిక నాగలక్ష్మీ దూసుకపోతున్నారు. శనివారం ఉదయం నుంచి ఆమె వార్డులో ప్రచారం ప్రారంభించారు. భర్త కోట్రిక శ్రీకాంత్ తో కలిసి 24 వార్డులోని మల్ రెడ్డిపల్లి తదితర ప్రాంతాల్లో ప్రచారం చేశారు. గులాబీ కండువా కప్పుకుని వార్డులో ఇంటింటికి తిరిగి ఓటర్లను కలిశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామిలను అమలు చేయకుండా చేస్తున్న మోసాలను వివరిస్తూ ప్రచారం చేశారు. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని, ఎన్నికల్లో గెలిపిస్తే వచ్చే వార్డు, ప్రజల అభివృద్ధికి అహర్నిషలు కృషి చేస్తానని ప్రజలకు భరోసా అందించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు వీరేందర్ రెడ్డి, నాయకులు రాజన్ గౌడ్, టైలర్ రమేష్‌ తదితరులు ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/40849/