schedule Monday, September 07, 2026

కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల అబ్జర్వర్ల నియామకం

calendar_today January 31, 2026
person dharshininews
కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల అబ్జర్వర్ల నియామకం
కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల అబ్జర్వర్ల నియామకం - నలుగురు నేతలు, న్యాయవాదితో కమిటి - ప్రకటించిన తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీ తాండూరు మున్సిపల్ ఎన్నికల అబ్జర్వర్ల కమిటిని ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రకటన విడుదల చేశారు. తాండూరు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఈ కమిటిని ఏర్పాటు చేసినట్లు ఉత్తర్వులలో స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన పరిమళ్ గుప్త, పట్లోళ్ల నర్సింలు, గురురాజ్ జోషి, మాజీ వైస్ చైర్మన్ అలీం, న్యాయవాది నర్సింగ్ రావులను నియమించారు. కాంగ్రెస్ పార్టీ తరుపున ఎన్నికలలో వారు తమ బాధ్యతను నిర్వహిస్తారని ఎమ్మెల్యే పేర్కోన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/40872/