schedule Monday, September 07, 2026

పటేల్ ప్రవీణ్‌ కన్నుమూత..!

calendar_today February 1, 2026
person dharshininews
పటేల్ ప్రవీణ్‌ కన్నుమూత..!
పటేల్ ప్రవీణ్‌ కన్నుమూత..! - ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి - తాండూరు, ఇందూరులో విషాధం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు బీఆర్ఎస్ పార్టీకి చెందిన పటేల్ ప్రవీణ్ కుమార్ కన్నుమూశారు. హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గత రెండు రోజుల క్రితం పటేల్ ప్రవీణ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. అదేరోజు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు. హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో పటేల్ ప్రవీణ్ చికిత్స పొందుతున్నారు. శనివారం పటేల్ ప్రవీణ్ కుమార్ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారినట్లు తెలిసింది.ఆదివారం పటేల్ ప్రవీణ్ మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. పటేల్ ప్రవీణ్ మృతితో కుటుంబంలో విషాధం నెలకొంది. పటేల్ ప్రవీణ్ రాజకీయాలలో చురుకుగా ఉండేవారు. ఆయన స్వగ్రామం ఇందూరులో ఎంపీటీసీగా సేవలు అందించారు. మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల మెజార్టీతో ఓటమి పాలు అయ్యారు. తాండూరు పట్టణంలో గంజ్‌లో వ్యాపార వేత్తగా పేరు ఉంది. మంచి మనసున్న పటేల్ ప్రవీణ్ కన్నుమూసిన విషయం తెలిసిన ప్రముఖులు, రాజకీయ నేతలు, అభిమానులు, ఆప్తులు విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/40874/