schedule Sunday, July 05, 2026

నమ్మకంతో గెలిపించండి..!

calendar_today February 1, 2026
person dharshininews
నమ్మకంతో గెలిపించండి..!
నమ్మకంతో గెలిపించండి..! - వమ్ము చేయకుండా అభివృద్ధి చేస్తా - బీఆర్ఎస్ మాజీ కౌన్సిలర్ పరిమళ రవీందర్ - 23వ వార్డులో ముమ్మర ప్రచారం తాండూరు, దర్శిని ప్రతినిధి : తనను నమ్మకంతో గెలిపిస్తే వమ్ము చేయకుండా అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్ పార్టీ మాజీ కౌన్సిలర్ గడ్డలి పరిమళ రవీందర్ అన్నారు. పట్టణంలోని 23వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థిగా పరిమళ రవీందర్ పోటీ చేస్తున్నారు. ఇందులో భాగంగా వార్డులో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. మహిళ కార్యకర్తలు, పార్టీ కార్యకర్తలతో కలిసి వార్డులో ఇంటింటికి తిరుగుతున్నారు. కారు గుర్తును ప్రదర్శిస్తూ ఎన్నికల్లో గెలిపించాలని కోరుతున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వార్డు ప్రజల అండ దండలు మెండుగా ఉన్నాయని అన్నారు. నాపై నమ్మకంతో గెలిపిస్తే వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా వార్డును అభివృద్ధి చేస్తానని అన్నారు. వార్డులో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి ఉందని, మళ్లీ బీఆర్ఎస్ గెలిస్తే ప్రగతిని సాధిస్తామని ప్రజలకు భరోసా అందించారు. అందుకే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/40884/