schedule Monday, September 07, 2026

పట్లోళ్ల దీపా నర్సింలు.. దూకుడు..!

calendar_today February 2, 2026
person dharshininews
పట్లోళ్ల దీపా నర్సింలు.. దూకుడు..!
పట్లోళ్ల దీపా నర్సింలు.. దూకుడు..! - ప్రచారం వేగవంతం చేసిన మాజీ వైస్ చైర్ పర్సన్ - 9వ వార్డులో బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలని ప్రచారం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు దూకుడు పెంచారు. పట్టణంలోని 9వ వార్డు నుంచి దీపా నర్సింలు రెండోసారి పోటీ చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలలో భాగంగా పట్టణంలోని 9వ వార్డులో ప్రచారం చేపట్టారు. సోమవారం వార్డులో పర్యటించారు. వార్డులో ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను కలుస్తున్నారు. పెద్దలు, మహిళలు, వృద్ధులను కలిసి కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం చేస్తున్నారు. వార్డులో దీపా నర్సింలు ప్రచారానికి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ సందర్భంగా దీపా నర్సింలు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీతోనే పట్టణ అభివృద్ధి జరుగుతుందని అన్నారు. ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/40921/