schedule Sunday, July 05, 2026

తాండూరులో 3 నామినేషన్ల విత్ డ్రా..!

calendar_today February 2, 2026
person dharshininews
తాండూరులో 3 నామినేషన్ల విత్ డ్రా..!
తాండూరులో 3 నామినేషన్ల విత్ డ్రా..! - రేపు ఉపసంహరణకు చివరి అవకాశం - మున్సిపల్ కమీషనర్ మధుసూదన్ రెడ్డి - ఏయే పార్టీ నుంచి ఉపసంహరించుకున్నారంటే..? తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మూడు నామినేషన్లు విత్ డ్రా అయినట్లు కమిషనర్ మధుసూదన్ రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. పట్టణంలో 36వార్డులకు గాను 179 నామినేషన్లు అయిన సంగతి తెలిసిందే. గత నెల 28 నుంచి నామినేషన్ల స్వీకరణ 30వ తేది వరకు జరిగింది. 31న నామినేషన్ల పరిశీలన, అర్హులైన పోటీ నామినేషన్లను ప్రదర్శించారు. ఆదివారం నుంచి నామినేషన్ల ఉపసంహరణ ప్రారంభమయ్యింది. ఆదివారం ఒక నామినేషన్ విత్ డ్రా చేసుకోగా సోమవారం 3 నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒకరు నామినేషన్లను ఉపసంహరించుకున్నట్లు కమీషనర్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. దీంతో నామినేషన్ల ఉపసంహరణ సంఖ్య 4 వరకు చేరుకుందని వెల్లడించారు. అదేవిధంగా రేపు మంగళవారం మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు ఉందని తెలిపారు. ఎవరైనా తమ నామినేషన్లను గడువులోగా ఉపసంహరించుకోవచ్చని తెలిపారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/40926/