schedule Sunday, July 05, 2026

సమస్యల పరిష్కారానికి ముందుంటా..!

calendar_today February 3, 2026
person dharshininews
సమస్యల పరిష్కారానికి ముందుంటా..!
సమస్యల పరిష్కారానికి ముందుంటా..! - బీఆర్ఎస్ మాజీ కౌన్సిలర్ పరిమళ రవీందర్ - 23వ వార్డులో ఆమె వెంటే బీఆర్ఎస్ బలగం తాండూరు, దర్శిని ప్రతినిధి : పట్టణంలోని 23వ వార్డులో ప్రజల సమస్యల పరిష్కారంతో పాటు అభివృద్ధి చేసేందుకు ముందుంటానని బీఆర్ఎస్ మాజీ కౌన్సిలర్, 23 వార్డు కౌన్సిలర్ అభ్యర్థి పరిమళ రవీందర్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఆమె వార్డులో ముమ్మర ప్రచారం చేస్తున్నారు. ఉదయం, రాత్రి ఇంటింటికి తిరుగుతున్నారు. వాల్మీకీ నగర్, సీసీఐ కాలనీలో పర్యటిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు వెంట రాగా పరిమళ ముందుండి ప్రచారం చేస్తున్నారు. వార్డు ప్రజలకు అన్ని విధాలుగా అందుబాటులలో ఉంటానని, అన్ని సమస్యలను పరిష్కరించే బాధ్యత తీసుకుంటానని భరోసా అందిస్తున్నారు. ఎన్నికల్లో గెలిచిన తరువాత దశల వారిగా అభివృద్ధి పనులు చేపడుతానని తెలిపారు. ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/40914/