schedule Monday, September 07, 2026

నిస్వార్థంగా సేవ చేస్తా..!

calendar_today February 4, 2026
person dharshininews
నిస్వార్థంగా సేవ చేస్తా..!
నిస్వార్థంగా సేవ చేస్తా..! - మున్సిపల్ ఎన్నికల్లో ఆదరించండి - 24 వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కోట్రిక నాగలక్ష్మీ తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రజలకు నిస్వార్థంగా సేవ చేస్తూ కోట్రిక కుటుంబ కీర్తి పెంచేలా కృషి చేస్తానని 24వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి కోట్రిక నాగలక్ష్మీ శ్రీకాంత్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అత్త, మామలు మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్యల ఆశీస్సులతో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె తన భర్త కోట్రిక శ్రీకాంత్ తో కలిసి 24వ వార్డులో ఉదయం, రాత్రి ముమ్ముర ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 24వ వార్డును నా కుటుంబంలా చూస్తానని అన్నారు. వార్డు కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఉన్నా దానిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు. ప్రజలకు మౌళిక సదుపాయాలు కల్పించడంతో పాటు వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు నిస్వార్థంగా పనిచేస్తానని అన్నారు. ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కోట్రిక నాగలక్ష్మి ప్రచారానికి వార్డు ప్రజలు ఆదరిస్తున్నారు. ఎన్నికల్లో అండగా ఉంటామని భరోసా అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, మహిలలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/40958/