schedule Monday, September 07, 2026

వాల్మీకీ నగర్ బాధలు తీరుస్తా..!

calendar_today February 4, 2026
person dharshininews
వాల్మీకీ నగర్ బాధలు తీరుస్తా..!
వాల్మీకీ నగర్ బాధలు తీరుస్తా..! - ఐదేళ్లలలో బీజేపీ చేసిందేమి లేదు - ముమ్మర ప్రచారంలో మాజీ కౌన్సిలర్ పరిమళ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం 23వ వార్డులోని వాల్మీకీ నగర్లో నెలకొన్న బాధలు తీరుస్తానని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, మాజీ కౌన్సిలర్ పరిమళ అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా వార్డులో మహిళలు, నేతలు, యువకులతో కలిసి ముమ్మర ప్రచారం చేస్తున్నారు. వార్డు మాజీ కౌన్సిలర్ అన్ని సమస్యలు, ఇబ్బందులు తనకు తెలుసని అన్నారు. ఐదేళ్ల కాలంలో బీజేపీ చేసిందేమి లేదని, కాంగ్రెస్ కూడా అభివృద్ధి చేయలేకపోయిందని అన్నారు. ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. వాల్మీకీ నగర్లో ఉన్న బాధలు తీరుస్తానని అన్నారు. అందరికి అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. ఎన్నికల ప్రచారంలో పరిమళ ప్రజలను ఆకట్టుకుంటున్నారు. మహిళలకు, అమ్మలకు చేతిలో చేయి వేస్తూ పలకరిస్తూ ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు.   ఇది కూడా చదవండి...   https://www.dharshininews.com/40967/