schedule Monday, September 07, 2026

సమస్యలు తీర్చేందుకు ముందుకొస్తున్నా..!

calendar_today February 5, 2026
person dharshininews
సమస్యలు తీర్చేందుకు ముందుకొస్తున్నా..!
సమస్యలు తీర్చేందుకు ముందుకొస్తున్నా..! - కారు గుర్తుకు ఓటేసి ఆదరించండి - 36వ వార్డులో రూప రుద్రుపాటిల్ ప్రచారం తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తీర్చేందుకు కౌన్సిలర్ గా పోటీ చేసేందుకు ముందుకు వచ్చానని తాండూరు 36వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి రూప రుద్రుపాటిల్ అన్నారు. గురువారం తన వార్డులో రూప రుద్రుపాటిల్ ప్రచారం నిర్వహించారు. భర్త రుద్రుపాటిల్, అనిల్ బాండ్, పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లారు. వార్డులోని ప్రతి ఒక్కరిని కలుస్తూ కౌన్సిలర్ గా ఆదరించాలని కోరుతున్నారు. వార్డులో ప్రజా సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు తెలిపారు. సమస్యల పరిష్కారంతో పాటు రోడ్లు, మురుగు కాలువలు వంటి మౌళిక సదుపాయాలు కల్పించి వార్డును అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి బంపర్ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/41000/