schedule Sunday, July 05, 2026

కారులో చేరికల జాతర..!

calendar_today February 5, 2026
person dharshininews
కారులో చేరికల జాతర..!
కారులో చేరికల జాతర..! - పైలెట్ రోహిత్ రెడ్డి సమక్షంలో చేరిక - గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు బీఆర్ఎస్ పార్టీలో చేరికల జాతర కొనసాగుతోంది. గురువారం తాండూరు పట్టణానికి చెందిన యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తాండూరు పట్టణంలోని 3వ వార్డుకు చెందిన శ్రీహరి తన మిత్రులతో పాటు 6వ వార్డుకు చెందిన మహేష్‌ పలువురు యువకులు గులాబీ గూటికి చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ వీడి వచ్చిన యువకలు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా పైలెట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం యువత సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ చైర్ పర్సన్ అభ్యర్థి పట్లోళ్ల నర్సింలు, సీనీయర్ నాయకులు డా.సంపత్ కుమార్, విజయ్ కుమార్, అబ్దుల్ సలీం తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/41008/