schedule Sunday, July 05, 2026

'చేతి' అభివృద్ధికే జై కొట్టండి..!

calendar_today February 5, 2026
person dharshininews
'చేతి' అభివృద్ధికే జై కొట్టండి..!
'చేతి' అభివృద్ధికే జై కొట్టండి..! - హస్తం పార్టీతొనే తాండూరుకు మహర్ధశ - తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి - కౌన్సిలర్ అభ్యర్థుల కోసం జోరుగా ప్రచారం తాండూరు, దర్శిని ప్రతినిధి : అభివృద్ధిని చేపట్టే కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకే ఓటు వేయాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం తాండూరు మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా పట్టణంలోని 30, 23వ వార్డులలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మెహరాజ్ బేగం, దొరశెట్టి సత్యమూర్తి గారికి మద్దతుగా ఎమ్మెల్యే మనోహర్‌ రెడ్డి ప్రచారం చేశారు. ఆయా వార్డులలో ఏర్పాటు చేసిన ముఖ్యనాయకుల సమావేశంకు హాజరైన స్థానిక ప్రజలతో మాట్లాడారు. ఈ సందర్భంగా రెండేళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఆశ్వీదించాలనీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మున్సిపల్ చైర్మన్ గా ఉంటే తాండూరు మరింతగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. అభివృద్ధిని చేసే కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు ధారాసింగ్, నాయకులు అఫ్పూ(నయూం), నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/41011/