schedule Tuesday, September 08, 2026

చిరస్మరణీయుడు పటేల్ ప్రవీణ్‌..!

calendar_today February 6, 2026
person dharshininews
చిరస్మరణీయుడు పటేల్ ప్రవీణ్‌..!
చిరస్మరణీయుడు పటేల్ ప్రవీణ్‌..! - తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి - దినకర్మలో పటేల్ చిత్రపటానికి నివాళులు - అన్నదానంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే తాండూరు, దర్శిని ప్రతినిధి : బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎంపీటీసీ స్వర్గీయ ప్రవీణ్ పటేల్ ఎప్పటికి అందరి హృదయాల్లో నిలిచిపోతారని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని భద్రప్ప చౌక్‌లో వీరశైవ యువదళం మరియు ప్రవీణ్ పటేల్ మిత్రబృందం ఆధ్వర్యంలో పటేల్ ప్రవీణ్‌ దినకర్మ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పైలెట్ రోహిత్ రెడ్డి గారు అతిథిగా హాజరై స్వర్గీయ ప్రవీణ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రోహిత్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రవీణ్ పటేల్ సేవ కార్యక్రమాలు ఎప్పుడూ ముందుండేవారని, ఆయన మన హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతారని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, వీరశైవ యువదళ సభ్యులు, ప్రవీణ్ పటేల్ మిత్రులు, అభిమానులు మరియు పెద్ద సంఖ్యలో పట్టణ ప్రజలు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/41026/