schedule Tuesday, September 08, 2026

గుర్తును చూండండి. కారుకే ఓటేయండి...!

calendar_today February 7, 2026
person dharshininews
గుర్తును చూండండి. కారుకే ఓటేయండి...!
గుర్తును చూండండి. కారుకే ఓటేయండి...! - 24వ వార్డు ఓటర్లతో కోట్రిక నాగలక్ష్మీ - ఉదయం, సాయంత్రం ముమ్మర ప్రచారం తాండూరు, దర్శిని ప్రతినిధి : మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో 24వ వార్డు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ కోడలు కోట్రిక నాగలక్ష్మీ తనదైన శైలిలో దూసుకపోతున్నారు. ఎన్నికల్లో తన గెలుపుకోసం ప్రచారం ముమ్మరం చేశారు. తాను పోటీ చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ గుర్తులను ప్రదర్శిస్తూ ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా మహిళ ఓటర్లతో వారి ఆడబిడ్డగా కలిసిపోతున్నారు. ఇంటింటికి తిరుగుతూ ఆప్యాయంగా పలకరిస్తున్నారు. మాజీ సీఎం కేసీఆర్, కారు గుర్తులను చూపిస్తూ ఓటర్లను పలకరిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటు వేయాలని, బంపర్ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నారు. ఎన్నికల్లో గెలిపిస్తే వార్డులో నెలకొన్న సమస్యలన్నీ పరిష్కరిస్తానని చెబుతున్నారు. అభివృద్ధి పనులు కూడా చేపట్టి వార్డును ఆదర్శంగా నిలుపుతానని చెబుతున్నారు. కోట్రిక విజయలక్ష్మీ కోడలుగా సేవ చేసి.. అందరి మద్దతుతో అన్ని హామిలు నెరవేరుస్తానని పేర్కొంటున్నారు. మరోవైపు కోట్రిక నాగలక్ష్మీ వెంట ఆమె భర్త కోట్రిక శ్రీకాంత్‌ ఉంటూ ప్రచారానికి అండగా నిలుస్తున్నారు. తన భార్యను కౌ్న్సిలర్‌గా గెలిపించాలని కోరుతున్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/41048/