వచ్చే ఐదేళ్లలో అభివృద్ధి బాధ్యత నాదే..!
February 7, 2026
dharshininews
వచ్చే ఐదేళ్లలో అభివృద్ధి బాధ్యత నాదే..!
- బీఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థి పట్లోళ్ల నర్సింలు
- తాండూరు 10వ వార్డులో ప్రచార జోరు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో బీఆర్ఎస్ పార్టీని గెలిపించండి.. వచ్చే ఐదేళ్లలో అభివృద్ది చేసే బాధ్యత నాదే అంటూ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పట్లోళ్ల నర్సంలు ప్రజలకు భరోసా కల్పించారు.
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 10వ వార్డులో పట్లోళ్ల నర్సింలు ప్రచారం జోరుగా నిర్వహించారు. తాను పోటీ చేస్తున్న వార్డులో ప్రతి ఒక్కరికి కలుస్తున్నారు. నర్సింలు వెంట గులాబీ శ్రేణులు సైన్యంలా కదులుతున్నారు. పట్లోళ్ల నర్సంలు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రూపొందించిన మెనిఫెస్టోను చూపిస్తూ ఓటర్లను కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. ప్రజల సమస్యలు, పట్టణ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని మెనిఫెస్టోను రూపొందించడం జరిగిందని చెబుతున్నారు.
ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే వచ్చే ఐదేళ్లలలో అభివృద్ధి చేసే బాధ్యత నాదే అంటూ అందరికి భరోసా కల్పిస్తున్నారు. కాలనీలోని ప్రతివీధుల్లో సమస్యలు లేకుండా చూస్తామని, సాయిపూర్ ప్రాంతాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాని చెబుతున్నారు. పట్లోళ్ల నర్సింలు ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి...
https://www.dharshininews.com/41067/