schedule Monday, September 07, 2026

ఇంటింటి ప్రచారంలో మనోహరన్న..!

calendar_today February 7, 2026
person dharshininews
ఇంటింటి ప్రచారంలో మనోహరన్న..!
ఇంటింటి ప్రచారంలో మనోహరన్న..! - 28, 7వ వార్డులలో విస్తృత ప్రచారం - చేతి గుర్తుకు ఓటేసి అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూర్ మున్సిపల్ ఎన్నికల్లో బాగుంగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. శనివారం తాండూరు పట్టణంలోని 28వ వార్డు అభ్యర్థి మేడి విజయ భాస్కర్, 7వ వార్డు అభ్యర్థి బాతుల నాగరాజుకు మద్దతుగా ప్రచారం చేశారు. ఆయా వార్డులలో ఇంటింటికి తిరుగుతూ చేతికి గుర్తుకు ఓటు వేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని, ఎమ్మెల్యేగా పట్టణంలోని అన్ని వార్డుల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తామని అన్నారు. 28వ, 7వ వార్డులకు నిధులు కేటాయించి సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. అభివృద్ధిని చేసే అధికార పార్టీకి చేతి గుర్తుకు మరవకుండా ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువకులు తదితరులు ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/41081/