పేదింటి ఆడపిల్లకు కానుక..!
February 8, 2026
dharshininews
పేదింటి ఆడపిల్లకు కానుక..!
- పుట్టినా, పెళ్లైనా నగదు అందిస్తా
- వార్డు ప్రజలకు పరిమళ అక్క ప్రామిస్
- వాల్మీకీ నగర్ ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ
తాండూరు, దర్శిని ప్రతినిధి : పేదింటి ఆడపిల్లలపై తాండూరు మున్సిపల్ మాజీ కౌన్సిలర్, బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి గడ్డలి పరిమళ రవీందర్ కానుకను అందిస్తానని హామి ఇస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో 23వ వార్డు నుంచి పరిమళ రవీందర్ కౌన్సిలర్‌గా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఎన్నికల్లో భాగంగా వార్డులోని వాల్మీకీ నగర్ ప్రజలకు నజరానా ప్రకటించారు. వార్డులోని పేదింట్లో ఆడపిల్ల పుట్టినా, పెళ్లైనా నగదు సాయం అందిస్తానని ప్రకటించారు. ఇంట్లో ఆడపిల్ల పుడితే రూ. 2,500లు అందిస్తానని తెలిపారు. అదేవిధంగా ఆడపిల్ల వివాహా సమయంలో రూ. 11వేల నగదు కానుకను అందిస్తానని హామి ఇచ్చారు. గడ్డలి పరిమళ తీసుకున్న నిర్ణయంతో స్థానిక ప్రజల్లో ఆమెకు ఆదరణ పెరుగుతోంది. ఎన్నికల్లో ప్రజలు ఆమె గెలుపును ఆకాంక్షిస్తూ ఆమె వెంట నడుస్తున్నారు. ఈ సందర్బంగా పరిమళ మాట్లాడుతూ వాల్మీకీ నగర్ ప్రజల అభివృద్ధే తన లక్ష్యమని, ప్రజల అవసరాలు తీర్చడమే ధ్యేయమని అన్నారు. ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదికూడా చదవండి...
https://www.dharshininews.com/41087/