schedule Tuesday, September 08, 2026

బీఆర్ఎస్ పార్టీకీ ఝలక్..!

calendar_today February 8, 2026
person dharshininews
బీఆర్ఎస్ పార్టీకీ ఝలక్..!
బీఆర్ఎస్ పార్టీకీ ఝలక్..! - హస్తం గూటికి గులాబీ నేతలు - పార్టీని వీడిన తర్లపల్లి భాను, కోట్రిక నాగరాజ్ - కాంగ్రెస్ కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే బీఎంఆర్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీకి ఝలక్ తగిలింది. గులాబీ పార్టీకి చెందిన నేతలు హస్తం గూటికి చేరుకున్నారు. ఆదివారం తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గులాబీ పార్టీ నేతలకు కాంగ్రెస్ కండువా కప్పి హస్తం గూటికి ఆహ్వానించారు. తాండూరు మున్సిపల్ కు చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, పోట్లీ మహారాజ్ దేవాలయ మాజీ చైర్మన్ తర్లపల్లి భాను కుమార్ (స్నేహ సూపర్ మార్కెట్), తాండూరు కిరాణ మార్చంట్స్ అసోసియేషన్ కార్యదర్శి కోట్రిక నాగరాజ్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలపుకు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చెన్నారం అనిల్ కుమార్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, యువ నాయకులు పునీత్, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/41093/