schedule Saturday, July 04, 2026

విజయం వైపు పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి అడుగులు

calendar_today February 8, 2026
person dharshininews
విజయం వైపు పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి అడుగులు
విజయం వైపు పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి అడుగులు - ఎన్నికల ప్రచారానికి ప్రజల్లో పెరుగుతున్న నమ్మకం - ఉదయం, సాయంత్రం సాయిపూర్‌లో ప్రచార హోరు తాండూరు, దర్శిని ప్రతినిధి : మున్సిపల్‌ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసేందుకు మాజీ కౌన్సిలర్ పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి సిద్దమవుతున్నారు. ఎన్నికల ప్రచారంతో విజయంవైపు నమ్మకం పెరిగిపోతోంది. సాయిపూర్‌లోని 12వ వార్డులో కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థిగా పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ గెలుపుకోసం ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఆమె ప్రచారం చేస్తున్నారు. నీరజాబాల్ రెడ్డి వెంట కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు దండుగా కదులుదున్నారు. భారీ సంఖ్యలో పాల్గొంటూ పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డిని గెలిపించాలని కోరుతున్నారు. పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి సైతం వార్డులో ఇంటింటికి తిరుగుతూ ఓటర్ల బలం పెంచుకుంటున్నారు. స్థానికంగా ఉండే తనను గెలించేందుకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. తనకు కేటాయించిన ఓటరు నెంబర్ పత్రాలను పంచుతూ చేతి గుర్తుకు ఓటు వేయాలని కోరుతున్నారు. రెండు పర్యాయాలు కౌన్సిలర్‌గా పనిచేసిన అనుభవంతో వార్డులోని అన్ని సమస్యలు తీరుస్తానని అన్నారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహాకారంతో వార్డుకు అధిక నిధులు తీసుకవచ్చి అభివృద్ధి పరుస్తానని హామి ఇస్తున్నారు. మరోవైపు తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి కూడా తన సతీమణి నీరజాబాల్ రెడ్డి గెలుపుకోసం కృషి చేస్తున్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/41105/