schedule Saturday, July 04, 2026

కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం..!

calendar_today February 9, 2026
person dharshininews
కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం..!
కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం..! - 35వ వార్డు అభ్యర్థిని గెలిపించండి - ఎన్నికల ప్రచారంలో బుయ్యని శ్రీనివాస్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయం అని ఆ పార్టీ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈవో బుయ్యని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం చివరి రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని 35వ వార్డు అభ్యర్థి అఫ్షా మైనా గెలుపు కోసం నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బుయ్యని శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి.. సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని.. సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహకారంతో అన్ని వార్డులను పార్టీలకతీతంగా అభివృద్ధి చేసుకోవచ్చని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో 35వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. బుయ్యని శ్రీనివాస్ రెడ్డి ప్రచారానికి స్థానిక ప్రజలు బ్రహ్మరథం పట్టారు పార్టీ నేతలతో కలిసి శ్రీనివాసరెడ్డి నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. వార్డులో ప్రతి ఓటర్లను కలుస్తూ చేతి గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, రొంపల్లి సంతోష్ కుమార్, కౌన్సిలర్ అభ్యర్థి భర్త మహమ్మద్ నూర్ అహ్మద్, వార్డు యువకులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.   ఇది కూడా చదవండి... https://www.dharshininews.com/41116/