schedule Saturday, July 04, 2026

సాయిపూర్‌లో కారు దూకుడు..!

calendar_today February 9, 2026
person dharshininews
సాయిపూర్‌లో కారు దూకుడు..!
సాయిపూర్‌లో కారు దూకుడు..! - హోరెత్తించేలా పట్లోళ్ల దంపతుల ప్రచారం - కారు గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి - 10లో పట్లోళ్ల నర్సింలు, 9లో దీప పర్యటనలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని సాయిపూర్ ప్రాంతంలో కారు దూకుడు కొనసాగింది. మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని చివరి రోజు బీఆర్ఎస్ పార్టీ ప్రచారం హోరెత్తింది. 10వ వార్డు నుంచి బీఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థి పట్లోళ్ల నర్సింలు ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. బీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా అభివృద్ధి చేసే బాధ్యత మాది అంటూ ప్రజలకు భరోసా అందించారు. మరోవైపు 9వ వార్డులో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పట్లోళ్ల దీపా నర్సింలు, ఆమె సహోదరి మాజీ కౌన్సిలర్ పట్లోళ్ల సావిత్రమ్మతో కలిసి ప్రచారం చేశారు. మహిళను కలుస్తూ బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని ప్రచారం చేశారు. పట్లోళ్ల కుటుంబ సభ్యుల ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీకి, పట్లోళ్ల నర్సింలు, దీపా నర్సింలులను గెలిపించాలని నినాదాలతో హోరెత్తించారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/41119/