schedule Saturday, July 04, 2026

ఓటు మీది.. అభివృద్ధి మాది..!

calendar_today February 9, 2026
person dharshininews
ఓటు మీది.. అభివృద్ధి మాది..!
ఓటు మీది.. అభివృద్ధి మాది..! - హస్తం అభ్యర్థులకు అభయం ఇవ్వండి - ఎన్నికల్లో కాంగ్రెస్ చేతి గుర్తుకే ఓటు వేయాలి - తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి - మున్సిపల్‌ అభ్యర్థుల తరుపున ప్రచారం తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుకోసం వేసే ఓటు మీది.. అభ్యర్థులు ఇచ్చిన హామి మేరకు అభివృద్ధి చేసే బాధ్యత మాది అని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ప్రజలకు భరోసా అందించారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా చివరి రోజు సోమవారం తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రచారం చేశారు. పట్టణంలోని 15, 16, 17, 18, 29వ వార్డులతో పాటు 13, 14, 18వ వార్డులలో పార్టీ కౌన్సిలర్ల అభ్యర్థులతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతోనే తాండూరు పట్టణ అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. పట్టణంలోని అన్ని వార్డుల అభివృద్ధికి ప్రణాళికలు సిద్దం చేయడం జరిగిందన్నారు. తాగునీరు, మురుగు కాలువలు, సీసీ రోడ్లు తదితర మౌళిక సదుపాయాలతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలు చేసేందుకు కృషి చేయడం జరుతుందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సహాకారంతో అధిక నిధులు తీసుకవచ్చి తాండూరును అభివృద్ధి చేసే బాధ్యత మాదే అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం చేతి గుర్తుకు ఓటు వేసే బాధ్యత మీదే అని అన్నారు. తాండూరును భ్రష్టు పట్టించిన బీఆర్ఎస్ పార్టీని, మాజీ ఎమ్మెల్యే హామిలను నమ్మరాదని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కౌన్సిలర్ అభ్యర్థులు, నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/41123/