schedule Saturday, July 04, 2026

కరాటే పోటీల్లో తాండూరు క్రీడాకారుల సత్తా..!

calendar_today February 9, 2026
person dharshininews
కరాటే పోటీల్లో తాండూరు క్రీడాకారుల సత్తా..!
కరాటే పోటీల్లో తాండూరు క్రీడాకారుల సత్తా..! - ఫస్ట్ ఇంటర్‌స్టేట్ చాంపియన్‌షిప్‌లో 11 గోల్డ్, 1 వెండి పతకాలు - అభినందించిన కరాటే సీనియర్ మాస్టర్ బీ.వీ. సాయి తాండూరు, దర్శిని ప్రతినిధి : కరాటే పోటీల్లో తాండూరు క్రీడాకారులు సత్తా చాటారు. 11 గోల్డ్, 1సిల్వర్ పతకాలు సాధించి భళా అనిపించారు. వికారాబాద్‌లో ఆదివారం ఫస్ట్ ఇంటర్ట్ ఛాంపియన్ షిప్-2026 కరాటే టోర్నమెంట్‌ జరిగింది. ఈ పోటీలలో తాండూరులోని మాస్టర్ జపాన్ ఛోటాఖాన్ కరాటే బ్లాక్‌ బెల్ట్ 7వ డాన్ బి.వి.సాయి మాస్టర్, బి.వి. మోహన్ కృష్ణ మాస్టర్ బ్లాక్ బెల్ట్ 5వ డాన్ల వద్ద శిక్షణ పొందిన 12 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ టోర్నమెంట్లో స్మితి వెండి పతకాన్ని సాధిం చింది. మిగతా వారిలో ఆలియాబేగం, అల్తియాజ్, వైష్ణవి, వినయ్కమార్, ప్రణయ్కుమార్, అబ్దుల్ అనిఫ్, రాజేష్, అల్ఫీజ్, జగదీష్, లక్ష్మీ, స్మితి(రిక్కు) పాల్గొని గట్టిపోటీ ఇచ్చారు. వీరిలో 11 మంది బంగారు పతకాలు సాధించారు. ఈ సందర్భంగా మాస్టర్లు సాయి, మోహన్ కృష్ణాలు విద్యార్థులను అభినందించారు. బంగారు, వెండి పతకాలు, కప్ సాధించండం చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/41134/