schedule Saturday, July 04, 2026

ఆదర్శమూర్తి సంత్‌ సేవలాల్ మహరాజ్..!

calendar_today February 15, 2026
person dharshininews
ఆదర్శమూర్తి సంత్‌ సేవలాల్ మహరాజ్..!
ఆదర్శమూర్తి సంత్‌ సేవలాల్ మహరాజ్..! - ఆయన జయంతిని సెలవు దినంగా ప్రకటించాలి - సేవాలాల్ జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చాలి. - మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వర్త్య విఠల్ నాయక్ తాండూరు, దర్శిని ప్రతినిధి : బంజారుల ఆరాధ్యదైవం సమాజానికి ఆదర్శమూర్తి అని తాండూరు మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ విఠల్ నాయక్ అన్నారు. ఆదివారం సంత్‌ సేవాలాల్ మహారాజ్ 278వ జయంతిని తాండూరులో ఘనంగా జరుపుకున్నారు. తాండూరు పట్టణం బాలాజీ నర్సింగ్ హోం సమీపంలోని సేవలాల్ మహారాజ్ విగ్రహనికి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వర్త్య విఠల్ నాయక్ పలువురుతో కలిసి పూలమాలలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సేవాలాల్ మహారాజ్ బంజారుల కోసం, సమాజం కోసం ఎంతో కృషి చేశారని అన్నారు. ఆయన జయంతిని ప్రభుత్వం సెలవుదినంగా ప్రకటించాలని కోరారు. సంతు సేవాలాల్ మహారాజ్ జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాలలో చేర్చాలని అభిలాషించారు. అదేవిధంగా గిరి పుత్రులు సేవాలాల్ మహారాజును ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. అనంతరం జయంతిలో భాగంగా హోమం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ సురేష్ నాయక్, మాజీ కో ఆప్షన్ నెంబర్ వెంకట్ రాము నాయక్, బషీర్‌మియా మాజీ సర్ పంచ్ మితృనాయక్, చరణ్ సింగ్, అనిల్ రాథోడ్, గోపాల్, రవి, అనార్ సింగ్, శంకర్, దీపక్ రాథోడ్, ప్రకాష్, చందర్, విజయ్‌ తదితరులు పాల్గొన్నారు. https://www.dharshininews.com/41309/