schedule Monday, September 07, 2026

పైలెట్ ఇంటికి పోలీసులు...!

calendar_today February 15, 2026
person dharshininews
పైలెట్ ఇంటికి పోలీసులు...!
పైలెట్ ఇంటికి పోలీసులు...! - హైదరాబాద్‌లో అరెస్టు చేసేందుకు యత్నం - హైటెన్షన్‌కు గురిచేస్తున్న రాజకీయ రగఢ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఇంటికి పోలీసులు వెళ్లడం రాజకీయ రగఢ రేపింది. హైదరాబాద్‌లో రోహిత్ రెడ్డిని అరెస్టు చేసేందుకు తాండూరు పోలీసులు యత్నించారు. ఆదివారం ఈ సంఘటన జరిగింది. తాండూరు మున్సిపల్ ఎన్నికలలో భాగంగా ఈనెల 13న సెయింట్ మార్క్స్ స్కూల్లో ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ కేంద్రంలోకి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, నేతలు వెళ్లడాన్ని రోహిత్ రెడ్డి అభ్యంతరం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పోలీసులు, రోహిత్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నేతల మద్య తోపులాట జరిగింది. రోహిత్ రెడ్డి, నేతలు పోలీసుల విధులను అడ్డుకున్నారంటూ వివాదం ఏర్పడింది. దీంతో పోలీసులు పైలెట్ రోహిత్ రెడ్డి, ఇతరులపై తాండూరు పోలీసులు బీఎన్ఎస్ఎస్ చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్‌ లో తాండూరు పోలీసులు మణికొండలోని రోహిత్ రెడ్డి నివాసానికి వెళ్లారు. అక్కడ రోహిత్ రెడ్డిని అరెస్టు చేసేందుకు యత్నించారు. సీసీ కెమెరాలలో రికార్డు అయిన దృశ్యాలు తాండూరు సామాజిక మాద్యమాలలో వైరల్ అయ్యాయి. రోహిత్ రెడ్డి ఇంట్లో పోలీసులు రావడాన్ని వీడియో తీస్తున్న వారి సెల్ ఫోన్లను లాక్కున్నట్లు తెలిసింది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో చోటు చేసుకున్న వివాదాలు, రోహిత్ రెడ్డి అరెస్టు పోలీసుల యత్నం వంటి పరిణామాలు రాజకీయ రగడను రేకేత్తిస్తున్నాయి. https://www.dharshininews.com/41322/