schedule Saturday, July 04, 2026

ముక్కంటి సేవలో బుయ్యని సరళా రెడ్డి

calendar_today February 15, 2026
person dharshininews
ముక్కంటి సేవలో బుయ్యని సరళా రెడ్డి
ముక్కంటి సేవలో బుయ్యని సరళా రెడ్డి - శివాలయాలలో ప్రత్యేక పూజలు - సల్లంగా చూడాలని వేడుకోలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు కాంగ్రెస్ నాయకులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి సతీమణి, ఆర్బీఓఎల్ ఎండీ బుయ్యని సరళా రెడ్డి శ్రీనివాస్ రెడ్డి ముక్కంటి సేవలో తరించారు. ఆదివారం మహా శివరాత్రి సందర్భంగా పట్టణంలోని శివాలయాలను సందర్శించారు. పట్టణంలోని చెరువెంటి ఈశ్వరాలయంలో శివున్ని దర్శించుకుని లింగానికి అభిషేకం చేశారు. అదేవిధంగా పట్టణంలోని అంతప్పభావి శివాలయంలో శివున్ని దర్శించుకుని అభిషేకంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ శివుని ఆశీస్సులు అందరిపై మెండుగా ఉండాలని ప్రార్థించారు. తాండూరు ప్రజలందరిని సల్లండా చూడు శివయ్య అంటూ వేడుకున్నట్లు తెలిపారు. మరోవైపు దేవాలయాలకు వచ్చిన సరళారెడ్డిని ఆయా దేవాలయాల కమిటి సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో భద్రేశ్వర దేవాలయ రేనవేష్‌ కమిటి మాజీ చైర్మన్ పటేల్ కిరణ్‌ కుమార్, కాంగ్రెస్ యువ నాయకులు, సామాజిక సేవా రత్న రొంపల్లి సంతోష్ కుమార్, దేవాలయాల కమిటి సభ్యులు తదితరులు ఉన్నారు.   https://www.dharshininews.com/41324/